గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు ఊహాగానాలకు తాత్కాలికంగా తెర

మాజీ మంత్రి, టీడీపీ MLA గంటా శ్రీనివాస్ రావు ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గంటా.. అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ టూర్‌ నేపథ్యంలో మళ్లీ టీడీపీ ఆఫీసుకు వచ్చారు. ఉత్తర నియోజకవర్గ నేతలతో సమావేశమై.. టూర్‌ ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కార్యక్రమాలకు గంటా అంటీముట్టనట్లుగా ఉండడంతో.. ఆయన వైసీపీలోకి వెళ్తున్నారంటూ ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టడంతో ఈ వాదనలకు బలం చేకూరింది. అయితే ఇంతలోనే మళ్లీ పార్టీ కార్యాలయానికి రావడం.. నేతలతో భేటీ కావడంతో.. పార్టీ మార్పు వార్తలకు గంటా తాత్కాలికంగా తెరవేసినట్లైంది.

TV5 News

Next Post

జబర్దస్త్‌ టీమ్‌కు దసరా కానుక ఇచ్చిన రోజా

Wed Oct 9 , 2019
తెలుగు లోగిళ్లను నవ్వుల కేరింతలతో, తుళ్ళింతలతో ఊపేస్తోన్న ప్రోగ్రామ్ ‘ జబర్దస్త్ ‘. రోజా నవ్వుల వెన్నెల, నాగబాబు గాంభీర్యంతో కూడిన నవ్వుల జడ్జిమెంట్ ఈ ప్రోగ్రామ్ కే హైలెట్. అయితే దసరా పండుగ సందర్భంలో జరిగిన జబర్దస్త్ షూటింగ్ లో ఒక ఆసక్తికర పవిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యుల్లా జబర్దస్త్ టీం మెంబెర్స్‌ని ఎంతో ఆప్యాయంగా చూసే రోజా టీం మెంబెర్స్ అందరికీ ఒక […]