కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్ గంభీర్

మాములుగా పెళ్లి సమయంలో తండ్రి తన కూతరు కాళ్ళు కడుగుతాడు.. అయితే టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాత్రం తన చిన్నారి కూతుళ్ళ  కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశాడనే డౌట్ రావొచ్చు.. ఇదంతా శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్‌ ఆచారంలో భాగం. ఈ ఆచారం ప్రకారం పెళ్ళైనా.. కాకపోయినా.. దసరా సమయంలో తండ్రి తన కూతుళ్ళ కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిమీద జల్లుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. గౌతమ్ గంభీర్ కూడా తన ఇద్దరు కూతుళ్ల కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రసుత్తం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్‌ చేస్తుండటం గమనార్హం.

TV5 News

Next Post

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడి.. ఆస్పత్రికి తరలింపు..

Wed Oct 9 , 2019
కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలం మద్దూరు దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. దసరా వేడుకలు జరుపుకుంటున్న తమపై నిందితులు ఎక్కడ నుంచో వచ్చి దాడి చేశారని బాధితుల బంధువులు పేర్కొన్నారు. ఘటనస్థలికి చేరుకున్న కంకిపాడు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న […]