క్లీన్ హైదరాబాద్ కోసం.. జీహెచ్ఎంసీ ఈ-ఫైన్

ghmc

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ ఫ్లెక్సీల తొలగింపు డ్రైవ్ కొనసాగుతోంది. అక్రమ బ్యానర్లు, పోస్టర్లను కూడా తీసేస్తున్నారు. మంగళవారం నుంచి దాదాపు 15వేలకు పైగా ఫ్లెక్సీలను తొలగించినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం తెలిపింది. అటు ఈ అక్రమ బ్యానర్లను నివారించేందుకు.. కొత్తగా ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది జీహెచ్ఎంసీ.

హైదరాబాద్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోంది జీహెచ్‌ఎంసీ. అయితే ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫ్లెక్సీలతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఇకపై నిబంధనలు అతిక్రమించిన వారికి.. ఈ-ఫైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెబుతున్నారు అధికారులు. నగరంలో ఇప్పటి వరకు విధించిన జరిమానాల స్థానంలో.. కొత్తగా ఈ- ఫైన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒక్కసారి చలాన్ వేస్తే.. దానిని తిరిగి తొలగించే పరిస్థితి ఉండదంటున్నారు అధికారులు.

TV5 News

Next Post

వల్లభనేని వంశీపై మండిపడ్డ ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు

Wed Nov 20 , 2019
వల్లభనేని వంశీ చేసిన వివాదాస్పదన వ్యాఖ్యలపై అమెరికాలోని ఎన్నారై టీడీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దీనిలో భాగంగా అట్లాంటాలో సమావేశమై.. వంశీ మాటలను ఖండించారు. స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తులు, ఇలా పార్టీని, పార్టీ అధినేతలపై అసభ్యకరంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. పార్టీని వీడేవారు.. తమ పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు.