కేంద్ర నిర్ణయంతో ఒక్క రోజులోనే బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?

ఆస్తులు లేకపోయినాసరే వీసమెత్తు బంగారమైనా ఉండాలనేది పెద్దల మాట. పసిడి లేనిదే ఏ శుభకార్యం జరగదు. పెళ్లి నుంచి చిన్నాచితకా ఫంక్షన్ల దాకా గోల్డ్ కంపల్సరీ. అందుకే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గ్రాము బంగారమైన కొనందే చాలామందికి నిద్రపట్టదు. ఇదే వ్యాపారులకు వరంగా మారింది. కానీ ఈ మధ్య పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో దిగుమతి సుంకం పెంచడంతో ఒక్కరోజే గోల్డ్ రేట్స్ చుక్కలనంటాయి. ఇంతకీ దిగుమతి సుంకాన్ని కేంద్రం ఎందుకు పెంచింది.?

గోల్డ్ దిగుమతిలపై కెంద్రం 10 నుంచి 12.5 శాతానికి సుంకాన్ని పెంచింది. బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి పన్నెండున్నర శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కరోజే బంగారం ధర రూ.590 పెరిగింది ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 34 వేల 800కు చేరింది…

గోల్డ్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. భవిష్యత్తులో ఈ ధరలు మరింత ఆకాశానికి అంటనున్నాయి. ఇప్పటికే మన దేశంలో బంగారం వినియోగం చాలా ఎక్కువ. పసిడి వినియోగంలో మన దేశం ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఏ చిన్న శుభకార్యమైనా పసిడి కంపల్సరీ. ఒకరకంగా చెప్పాలంటే బంగారం లేకుండా మన దేశంలో ఏ శుభకార్యం జరగదు. ఇక కట్నకానులకలు ఇచ్చినా ఇవ్వకపోయినా బంగారం లేకుండా వివాహం జరగదు… దంతేరస్, అక్షయ తృతీయ, దీపావళి వంటి ప్రత్యేక సందర్భాల్లో గ్రాము బంగారమైనా కొనాల్సిందేననే సెంటిమెంట్ ఉంది. చాలామంది అప్పులు చేసైనా సరే గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపుతుంటారు. బంగారాన్ని చాలా మంది ఆస్తిగా భావిస్తారు. అందుకే పసిడి అంటే చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తుంటారు….

మన దేశంలో లోహాల్లో పసిడికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. విదేశాల నుంచి వచ్చేవారు దొంగచాటుగా గోల్డ్ తెస్తుంటారు. ప్రతి విమానాశ్రయంలో ఇలాంటి వాళ్లు అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. గత ఏడాది 90 నుంచి 95 టన్నుల గోల్డ్ మన దేశంలోకి స్మగ్లింగ్ రూపంలో వచ్చినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. బంగారం కోసమే చైన్ స్నాచింగులు, దొంగతనాలు పెరిగాయి. ఇంత జరుగుతున్నా వినియోగం మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే బంగారం ఉత్పత్తి మన దేశంలో డిమాండుకు తగినంత లేదు. అత్యధిక పసిడిని ఉత్పత్తి చేసే ఆఫ్రికా లాంటి కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం…

గోల్డ్ ని ప్రజలు వాడుతున్నా… దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతోంది. ఏటా 800 టన్నుల బంగారాన్ని మన దేశం ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది 850 టన్నుల వరకు గోల్డ్‌ను ఇంపోర్ట్ చేసుకునే ఛాన్స్ ఉందని గత జనవరిలోనే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 3 వేల 280 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఈసారి ఈ విలువ మరింత పెరుగనుంది.

గోల్డ్ కొనుగోలుకు విదేశీ మారకం నిల్వలను వినియోగించడం వల్ల కరెంటు ఖాతా లోటు ఏర్పడుతోంది. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తోంది. అందుకే మన కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతిపై సుంకాన్ని ఏటా పెంచుతూ వస్తోంది. 10 శాతం ఉన్న సుంకాన్ని 12.5 శాతానికి పెంచింది. సుంకం పెంచడంతో ధరలు పెరుగుతాయి. ఫలితంగా గోల్డ్ వినియోగం తగ్గి… కరెంటు ఖాతా లోటు అదుపులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది మన దేశానికి ఆర్థికంగా మేలు చేసే చర్యే అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కేసీఆర్ ఆశయానికి తూట్లు.. మిషన్‌ భగీరథ పైపుల్ని అమ్ముకుంటున్న అధికారులు

Sat Jul 6 , 2019
తెలంగాణంలో ప్రతి ఇంటికి నల్లా ఉండాలన్నది సీఎం కేసీఆర్‌ ఆశయం! అందుకే కోట్ల రూపాయలు ఖర్చైనా సరే… మిషన్‌ భగీరథ చేపట్టారు. కానీ సీఎం ఆశయానికి ఆదిలోనే తూట్లు పొడుస్తున్నారు కొందరు అధికారులు. మిషన్‌ భగీరథ పైపుల్ని అమ్మేసి….తమ జేబు నింపుకుంటున్నారు. టీవీ5 పరిశోధనలో వెలుగు చూసిన ఆ స్కాం…. పుట్టు పూర్వోత్తరాలేంటో మీరే చూడండి..! ఇంటింటికి మంచినీరు అందించాలనే లక్ష్యంతో….సీఎం కేసీఆర్‌ మిషన్ భగీరథ చేపట్టారు. అయితే.. ఆయన […]