పసిడి ధరలు పైపైకి.. పది గ్రాములు..

బంగారం ధర మండిపోతోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. ఫెడ్ వడ్డీరేట్లు, అమెరికా చైనా ట్రేడ్‌వార్ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ పెరిగిన క్రమంలో బంగారం ధర భారీగా పెరుగుతూ పోతోంది. భారత్‌లో బంగారం ధరలు రూ.38 వేలు మార్కెట్‌ను దాటి 40 వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. వెండి కూడా దాదాపుగా ఇదే రేంజ్‌లో పరుగులు పెడుతోంది. కాగా, పాకిస్తాన్‌లో ఇండియాతో పోలిస్తే బంగారం రెట్టింపు ధర పలుకుతుంది. సోమవారం పాకిస్తాన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.74,588గా ఉంది. ఇక అక్కడ బంగారం ధర ఒక్కో నగరంలో ఒక్కోలా ఉంటుంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

శ్రీరాముడి వంశానికి వారసులం అంటూ..

Tue Aug 13 , 2019
అయోధ్య రామ జన్మభూమి వివాదం సుప్రీం కోర్టులో ఉంది. రఘువంశానికి చెందిన వారసులెవరైనా అయోధ్యలో నివసిస్తున్నారా అన్న కోర్టు ప్రశ్నకు భాజపా ఎంపీ, జైపూర్ రాజకుమారి దియా కుమారి తాము శ్రీరాముని కుమారులైన లవ కుశుల జంటలో కుశుడి వంశస్థులం అని చెప్పుకొచ్చారు. తమ కుటుంబం వద్ద ఉన్న పురాతన రాత ప్రతులు, వంశవృక్షం వివరాల ఆధారంగానే చెప్పగలుగుతున్నానని ఆమె అంటున్నారు. మేమే కాదు ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముని వంశస్థులు […]