టెకీలకు గుడ్ న్యూస్

ఇనాళ్ళు స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం క్రమక్రమంగా పుంజుకుంటుంది. స్లోడౌన్‌ అంటకాలు తొలుగుతుండడంతో నియామకాలు ఊపందుకోనున్నాయి. 2008 నుంచి ఐటీలో రంగంలో వచ్చిన సంక్షోభం వల్ల ఆ రంగంలో రిక్రూట్‌మెంట్ తగ్గింది. దీంతో నిరుద్యోగం అంతకంతకు పెరుగుతూ వంచింది. ప్రపంచ వ్యాప్తంగా సాకేంతిక రంగంలో సానుకుల పవనాలు వీస్తుండడంతో పలు కంపెనీలు సిబ్బంది సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో బహుళజాతి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ బెంగళూర్‌ సెంటర్‌లో ఇంజనీర్ నిపుణులను భారీగా పెంచుకోవాలని కసరత్తు చేస్తుంది.

ప్రస్తుతం ఇండియాలో గోల్డ్‌మాన్‌కు 5000 మంది ఉద్యోగులు ఉన్నారు. 290 మంది ఉద్యోగులతో 2004లో కార్యాలయాలను నెలకొల్పిన ఈ కంపెనీ క్రమక్రమంగా ఉద్యొగాల సంఖ్యను పెంచుతూ వచ్చింది. భారత్‌లో ఏటా 24 శాతం మేర విస్తరిస్తూ వస్తున్నామని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ సర్వీసెస్‌ ఇండియా హెడ్‌ గుంజన్‌ సంతాని చెప్పారు. అలాగే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ 20 శాతం మేర పెరగాయని వివరించారు. ప్రస్తుత వ్యాపార వృద్దికి అణుగుణంగా హైరింగ్‌ ప్రక్రియను చేపడతామని తెలిపారు. ఇండియాలో ఉన్న బెంగళూర్ పెంటర్ తమకు కీలకమని ప్రస్తుతం దానిపై దృష్టి సాధించినట్లుగా వెల్లడించారు. భవిష్యత్‌‌లో కీలకం కానున్న ఆటోమేషన్‌, డిజిటైజేషన్‌ బిజినెస్‌పై
ఫోకస్ పెట్టినట్లుగా వివరించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు

Fri May 31 , 2019
1.రాజ్ నాథ్ సింగ్ – రక్షణశాఖ 2. అమిత్ షా – హోంశాఖ 3. కిషన్ రెడ్డి – హోంశాఖ సహాయమంత్రి 4.నిర్మలాసీతారామన్ – ఆర్థిక శాఖ 5. రవిశంకర్ ప్రసాద్ – న్యాయ, ఐటీశాఖ 6.స్మృతీ ఇరానీ -స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 7.ఎస్.జయశంకర్-విదేశాంగ శాఖ 8.రామ్ విలాస్ పాశ్వాన్ – పౌరసరఫరాలశాఖ, 9.హర్ సిమ్రత్ కౌర్ – ఫుడ్ ప్రాసెసింగ్ 10. పీయూష్ గోయల్ – రైల్వేశాఖ […]