గోల్కొండ అమ్మవారి ఆషాఢమాస బోనాలు

డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటపాటలు, భక్తుల కోలాహలం మధ్య గోల్కొండ అమ్మవారు గురువారం బోనాలు అందుకోనున్నారు. ఆషాఢ మాస బోనాలు చారిత్రాత్మక గోల్కొండ కోటపై ఉన్న ఎల్లమ్మ జగదాంబిక ఆలయం నుంచి ప్రారంభమవుతాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జీహెచ్‌ఎంసీ,జలమండలి అదికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌,డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ లంగర్‌హౌస్‌ చౌరస్తా వద్ద అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

అనంతరం.. తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఛోటాబజార్‌ వద్ద ఉన్న అనంతచారి ఇంట్లో ఆభరణాల అలంకరణ పూర్తి చేశాక అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని దిగంబర్‌ పంతులు ఇంట్లోకి తీసుకొస్తారు. అమ్మవారికి ఒడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగిస్తారు. గోల్కొండలో బోనాలు మూడు ధఫాలుగా ఈ నెల 4,11,18 వ తేదీలలో నిర్వహిస్తారు. గురువారం నాడు ప్రారంభమైన ఈ వేడుకలు తిరిగి గురువారం నాడు ముగుస్తాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అమ్మా.. లే.. ప్లీజ్.. వీడియో వైరల్

Thu Jul 4 , 2019
ఇంటికొచ్చిన పిల్లలకి అమ్మ కనిపించకపోతే ఎంత గాభరా పడిపోతారు. అమ్మ కోసం ఇల్లంతా కలియతిరుగుతారు. అమ్మ పంచే ప్రేమ అమృతం కన్నా మిన్న.. అది మనుషుల్లోనే కాదు మృగాల్లోనూ ఉంటుందని నిరూపిస్తుంటాయి జంతువులు. అమ్మ చనిపోయిందని తెలియక అమ్మని లేపే ప్రయత్నం చేస్తోంది చిన్ని రైనో (ఖడ్గమృగం). వేటగాడి క్రూర దాహానికి అమ్మ బలైపోయిన విషయం తెలియక అమ్మ కోసం అల్లాడుతోంది. అమ్మ చుట్టూ తిరుగుతూ.. అమ్మ లేవట్లేదేంటని ఏడుస్తోంది. […]