ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌కి మరో ఛాన్స్ ఇచ్చిన గోపిచంద్

మాస్ లో ఫాలోయింగ్ ఉన్న హీరో గోపిచంద్. ఈ దసరాకి తన కొత్త సినిమా చాణక్యతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తిరు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ గా, టెర్రరిజమ్ బ్యాక్ డ్రాప్ లో చాణక్య తెరకెక్కింది. ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఒక్కొక్కటిగా సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్.

రీసెంట్ గానే బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో గోపిచంద్ ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాతో సుబ్రహ్మణం అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇక గురువారం గోపిచంద్ సినిమాలకు సంబంధించి మరో అనౌన్స్ మెంట్ వచ్చింది. దర్శకుడు సంపత్ నందితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గోపిచంద్. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో గౌతమ్ నందా వచ్చింది. అయితే అది నిరాశపరిచింది. అయినప్పటికీ కథ మీదున్న నమ్మకంతో మళ్ళీ సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చాడు గోపిచంద్.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భారత్ పైకి మోర్టార్‌ షెల్స్‌ ను ప్రయోగించిన పాకిస్థాన్

Thu Sep 19 , 2019
జమ్ముకశ్మీర్‌ విషయంలో రగిలిపోతున్న పాకిస్తాన్‌.. సరిహద్దుల్లో భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. పూంఛ్ జిల్లాలోని పలు గ్రామాల్లో మోర్టార్‌ షెల్స్‌ ను ప్రయోగించింది. వీటిలో కొన్ని పేలగా మరికొన్ని పేలలేదు. భయాందోళకు గురైన స్థానికులు సమాచారం ఇవ్వడంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది . 9 మోర్టార్‌ షెల్స్‌ను స్వాధీనం చేసుకుంది. అనంతరం మెంధార్‌ ప్రాంతంలో వాటిని చాకచక్యంగా నిర్వీర్యం చేసింది ఆర్మీ. మోర్టార్‌ షెల్స్‌ […]