ఎర్రమంజిల్ భవనం‌ కూల్చివేతపై హైకోర్టులో విచారణ

ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై రాజకీయం కొనసాగుతునే ఉంది. దీనిపై దాఖలైన పిటిషన్‌ పై హైకోర్టు విచారించింది. భవనం కూల్చివేత అవసరమా అంటూ కోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం అసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అసెంబ్లీ భవనం.. రాజుగారి నివాసం కోసం నిర్మించిందని అందులో అసెంబ్లీ నిర్వహించడానికి వసతులు సరిగా లేవని తెలిపింది. అందుకే కొత్త నిర్మాణం చేపట్టినట్టు ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు. విధాన పరమైన నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు లు గతంలో ఇచ్చిన తీర్పులను కోర్టుకు తెలియజేశారు. కొత్త భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయా అని కోర్టు అడిగిన ప్రశ్నకు.. అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా HMDA నుంచి అనుమతి తీసుకోలేమన్న ప్రభుత్వం విస్తీర్ణం ఎంత ఉందో చూసిన తర్వాతనే తాము HMDA అనుమతి కోరుతామని స్పష్టం చేసింది.

ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతోందని.. ఎక్కడ దుర్వినియోగం చేయడం లేదని వాదించింది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం 102 సంవత్సరాల క్రితం… నిర్మించారని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. ఇందులో సరైన సదుపాయాలు లేకపోవడం వల్లే కూల్చి.. కొత్తగా సకల సదుపాయాలతో నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీం, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను కోర్టుకు చూపించారు. అసెంబ్లీ కి ఉండాల్సిన వసతులు, సౌకర్యాలు ప్రస్తుత భవనంలో లేవని తెలిపారు. ప్రభుత్వ వాదన విన్న న్యాయస్థానం విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని.. చితకబాదిన భార్య

Fri Jul 26 , 2019
మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తూ.. బిడ్డను, తనను నిర్లక్ష్యం చేసిన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చెప్పులతో కొట్టిందో భార్య. మంచిర్యాల జిల్లా కొత్తకమ్ముగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు.. సౌజన్య అనే మహిళతో 2010లో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం లక్ష్మణ్‌కు కరీంనగర్‌ జిల్లా వెంకట్రావు పేటకు చెందిన అనూష అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కాగా […]