ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేం: హైకోర్టు

Read Time:0 Second

hc

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణను మంగళవారం వాయిదా వేసింది. సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని స్పష్టం చేసింది. చర్చలు జరపాలని ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. సమ్మెపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. అయితే ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని అత్యవసర సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన జీవో చూపాలని ఆదేశించింది న్యాయస్థానం. ఆర్టీసీని పబ్లిక్‌ యుటిలిటీ సర్వీస్‌గా ప్రకటించినందున ఎస్మా పరిధిలోకి వస్తుందని కృష్ణయ్య వాదించారు. దీంతో ప్రజా ప్రయోజన సేవలన్నీ అత్యవసర సర్వీసులు కావని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో ఇస్తేనే అత్యవసర సర్వీసుగా ఉంటుందని స్పష్టం చేసింది.

అంతకుముందు.. ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ తీర్మానాన్ని అందజేసింది. న్యాయస్థానం సూచన మేరకు 47 కోట్లు చెల్లించినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావని తెలిపింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి 47 కోట్లు చెల్లించాలన్న హైకోర్టు సూచనను పరిశీలించి అధ్యయనం చేస్తే 2 వేల 209 కోట్ల దాకా తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలున్నాయని తేలినట్లు పేర్కొంది. మరోవైపు విలీనంపై కార్మికులు మొండిపట్టుతో వ్యవహరిస్తే చర్చలు సాధ్యం కావని హైకోర్టుకు అందజేసిన నివేదికలో ప్రభుత్వం తెలిపింది.

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ జరుపుతామని న్యాయస్థానం తెలిపింది. విద్యాసంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు ప్రకటించింది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close