మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 5 గంటలు ఛార్జింగ్.. 100 కి.మీ రన్నింగ్

మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. 5 గంటలు ఛార్జింగ్.. 100 కి.మీ రన్నింగ్

టూ వీలర్ బైక్‌లంటే ఇష్టం వుండే వారికోసం హీరో సంస్థ మార్కెట్లోకి లిథియం బ్యాటరీతో నడిచే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఆప్లిమా ఈఆర్, ఎన్‌వైఎక్స్ ఈఆర్ పేరిట వీటిని మార్కెట్‌లోకి తీసుకు వచ్చింది. వీటి ధరలను వరుసగా రూ.68,721, రూ.69,754గా నిర్ణయించినట్లు కంపెనీ సీఈవో సోహిందర్ గిల్ వెల్లడించారు. 5 గంటల పాటు ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జ్ అవుతుందని, దీంతో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు. బ్యాటరీపై మూడేళ్ల వారెంటీ కూడా అందిస్తున్నామని అన్నారు. ఈ సదుపాయం కల్పించే ఏకైక కంపెనీ తమదేనని వివరించారు. ప్రస్తుతం లిథియం బ్యాటరీ ధర రూ.18వేల వరకు ఉందని.. భవిష్యత్తులో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయని తెలిపారు. రెండు మూడేళ్ల తరువాత సగం ధరకే ఈ బ్యాటరీలు లభ్యమవుతాయని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story