ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన హీరో.. పోలీసుల చేతిలో..

వెళ్లవయ్యా వెళ్లు.. నువ్వు నాగశౌర్య అయితే మాకేంటి. ట్రాఫిక్ రూల్స్ అందరికీ ఒకటే.. మీరు హీరోలని మిమ్మల్ని వదిలేశామనుకోండి.. సామాన్యుల చేతిలో మేం బుక్కయిపోతాం. రూల్స్ అతిక్రమించినా వాళ్లనైతే వదిలేస్తారు. మమ్మల్ని మాత్రం బాదేస్తారని అంటారు. అయినా సినిమాల్లో ఎన్నో నీతులు చెబుతారు. మరి ఆచరణలోకి వచ్చేసరికి అందరిలానే ప్రవర్తిస్తామంటారు. ఆ పాత్రల్లో కొంచెమైనా జీవించలేరా హీరోలు.. ట్రాఫిక్ రూల్స్‌‌కు ఎవరూ అతీతులు కారని నిరూపించారు హైదరాబాద్ పోలీసులు. బంజారా హిల్స్ రోడ్ నెం.1లో రెగ్యులర్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వస్తున్న నాగశౌర్య కారును ఆపి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించి రూ.500లు ఫైన్ వేశారు. ఇటీవల అల్వాల్ సమీపంలో మంచిర్యాల జాయింట్ కలెక్టర్ కారు ఓవర్ స్పీడ్ వెళుతుండడంతో ఆయనకూ చలాన్ రాశారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఒకనొక సందర్భంలో ట్రాఫిక్ రూల్స్‌ని అతిక్రమించినవారే.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారింది - భట్టి విక్రమార్క

Wed Aug 14 , 2019
తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారిందన్నారు కాంగ్రెస్‌నేత భట్టి విక్రమార్క. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించి.. కేంద్రం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పర్యటిస్తానన్నారు భట్టి. కాంగ్రెస్‌ పార్టీ తరపున మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌ తన రాజమహల్‌ నుంచి బయటకొచ్చి చూస్తే సమస్యలు తెలుస్తాయని విమర్శించారు . రాష్ట్రంలో విద్య, వైద్యం మాఫియా చేతుల్లో నడుస్తోందని ఫైరయ్యారు […]