శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వద్ద హై అలర్ట్

నెల్లూరు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. సముద్రమార్గం ద్వారా టెర్రరిస్టులు చొరబడే ప్రమాదముందని వార్నింగ్ ఇచ్చాయి. శ్రీలంక మీదుగా ముష్కరులు ప్రవేశించే అవకాశముందని పేర్కొన్నాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మెరైన్ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ బలగాలు సంయుక్తంగా రంగంలో దిగాయి. బంగాళాఖాతం వెంబడి 50 కిలోమీటర్ల మేర గస్తీని ముమ్మరం చేశారు. శ్రీహరికోట పరిసరాల్లో అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వేనాడు దర్గాకు వచ్చే వాహనాలను నిశితంగా తనిఖీ చేస్తున్నారు.

ఆర్టికల్-370 రద్దుతో పాకిస్థాన్ రగిలిపోతోంది. ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ దేశంలో విధ్వంసం సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. 2008 నవంబర్ 26 నాటి ఉగ్ర దాడులను రిపీట్ చేయాలని టెర్రరిస్టులు ప్రణాళిక రచిస్తున్నారు. కోయంబత్తూరు, మధురై, తిరుమల, షార్ తదితర ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఒక తప్పు.. ముగ్గురి ప్రాణాలను తీసింది

Fri Sep 13 , 2019
క్షణికావేశం ఒక కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను తీసింది. ఒక తప్పు మొత్తం కుటుంబాన్ని బలిగొంది. చివరికి మనవరాలి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న తాత కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌, స్వరూప దంపతులకు ఒక కొడుకు.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సిరివల్లి అనే కూతురు 2017లో హత్యకు గురైంది. […]