ట్రంప్ అధికార దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలింది : కాంగ్రెస్

Read Time:0 Second

వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందని కాంగ్రెస్ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్ధి జో బిడెన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలంటూ ట్రంప్ ఉక్రెయిన్ ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికన్ కాంగ్రెస్ వెల్లడించింది. గత జులైలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి ట్రంప్ చేసిన ఫోన్ కాల్స్ వివరాలతోకూడిన 3వందల పేజీలను హౌజ్ ఆఫ్ ఇంటలీజెన్స్ కమిటీ బయటపెట్టింది. దీని ఆధారంగా సభలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. 232- 196 ఓట్ల తేడాతో నెగ్గడంతో అభిశంసన ప్రక్రియ మరింత వేగం కానుంది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close