ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ.. బంగారు ఆభరణాలు..

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయలు విలువ చేసే 12 కిలోల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ చోరీకి సంబంధించిన ఆధారాలు సేకరించారు.

బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలో ఫూటేజ్‌ రికార్డు కాకుండా హార్డ్‌ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే బ్యాంక్‌లో ఆభరణాలను కుదవపెట్టిన వివరాలు తెలియకుండా కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ధ్వంసం చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బ్యాంక్‌ మేనేజర్‌ పురుషోత్తం, క్యాషియర్‌ నారాయణస్వామిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

TV5 News

Next Post

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Mon Oct 14 , 2019
రైతుకు పెట్టుబడి సాయం అందించే భరోసా పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి సాయాన్ని 12 వేల 5 వందల నుంచి 13 వేల 5 వందలకు పెంచింది. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి అందిస్తుండడంతో.. పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనగా నామకరణం చేశారు. నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి‌. రాష్ట్ర ప్రభుత్వం […]