అమీర్ పేట్ మెట్రో ప్రమాదంపై వివరణ ఇచ్చిన అధికారులు

హైదరాబాద్ లోని అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మహిళ కూకట్‌పల్లికి చెందిన మౌనికగా గుర్తించారు. ఈ మృతి ఘటనను మెట్రో ఎండీ ఎన్ వి ఎస్ రెడ్డి ధృవీకరించారు. మృతి చెందిన మౌనిక టిసిఎస్ కంపెనీలో పని చేస్తోందని తెలిపారు. దాదాపు తొమ్మిదడుగుల ఎత్తునుంచి పదునైన పెచ్చులు పడిపోవడంతో ఆమె మృతి చెందిందని వివరణ ఇచ్చారు. బాధితుల కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తామని ఎల్ అండ్ టి అధికారులు ప్రకటించారు.

Also watch :

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

బ్రాండెడ్ వంట నూనెలో పామాయిల్ కలిపి..

Sun Sep 22 , 2019
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో అక్రమ ఆయిల్ దందా గుట్టు రట్టు అయ్యింది. శ్రీనివాస ఏజెన్సీపై పోలీసులు, ఇంఛార్జి జిల్లా ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ దాడులు నిర్వహించారు. 4 వేల లీటర్ల వంట నూనెను స్వాధీనం చేసుకొని నూనె నమూనాలను సేకరించి ల్యాబ్‌కు తరలించారు. శ్రీనివాస ఏజెన్సీలో బ్రాండెడ్ వంట నూనెలో పామాయిల్ పోసి అమ్ముతున్నారని పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు వేల లీటర్ల వంట […]