గణేష్ నిమజ్జనం రోజు మెట్రోలో..

రోజూ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఆఫీస్‌కి వెళ్లే సరికి దేవుళ్లంతా కనిపిస్తుంటారు. మరి గణేష్ నిమజ్జనం రోజు ట్రాఫిక్ మామూలుగా ఉండదుగా. ఇక ఆ రోజు రోడ్లన్నీ ఫుల్. బండి తీసి తొందరగా వెళ్దామనుకుంటే మాత్రం బుక్కయిపోతారు. అందుకే బండి ఇంట్లో పెట్టి మెట్రో ఎక్కమంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఆరోజు గణపతులన్నీ నిమజ్జనం కోసం
ట్యాంక్‌బండ్‌కు తరలుతాయి కాబట్టి.. ఆవైపుగా వెళ్లే మార్గాల్లో ఇతర వాహనాలను అనుమతించరు. భారీ వాహనాలను నగర శివార్లలోనే ఆపేస్తారు. ఆర్టీసి బస్సులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. నిమజ్జనోత్సవాన్ని వీక్షించడానికి వచ్చే ప్రజల కోసం ట్యాంక్‌బండ్‌పై అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ అనిల్ కుమార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్, పంజాగుట్ట మార్గాల నుంచి వచ్చేవారు నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ మార్గం గుండా కాకుండా, వేరే మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. సహాయం కావాలనుకునేవారు 040-27852482,9490598985 నెంబర్లలో సంప్రదించవచ్చు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రికార్డు స్థాయిలో 'సైరా' డిజిటల్ రైట్స్ .. ఎంతో తెలుసా?

Wed Sep 11 , 2019
మెగాస్టార్ మెగా మూవీ సైరా హడావుడి స్టార్ట్ అవుతోంది. మరో ఇరవై రోజుల్లో సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీకి ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. కర్నూలులోనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందంటున్నారు. దక్షిణాదిలో నాలుగు బాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ కాబోతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకి 250 కోట్లు ఖర్చు చేశారనే టాక్ వినిపిస్తోంది. హిస్టారికల్ మూవీ కావడంతో […]