అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి

అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హైదరాబాద్‌ నాగోల్‌లోని సాయినగర్‌లో నివాసముండే వనితకు శివకుమార్‌ అనే వ్యక్తితో గత కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అనంతరం భర్తతో విభేదాలు, అత్తింట్లో వేధింపులు తాళలేక హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. అయితే.. గత జులైలో అమెరికాలోని నార్త్‌ కరోలినాలో ఉంటున్న భర్త వద్దకు వెళ్లింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులతో వనిత కాంటాక్ట్‌లో లేదు. హఠాత్తుగా వనిత మృతి చెందిందంటూ తల్లిదండ్రులకు సమాచారం అందింది. తమ కూతురి మరణానికి భర్త, అత్తింటి వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కరోలినా పోలీసులు మృతురాలి భర్త శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

 

TV5 News

Next Post

దేవాలయంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల కీలక భేటీ!

Mon Oct 7 , 2019
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య అక్టోబర్‌ 11న చారిత్రక ప్రాధాన్యమున్న తమిళనాడులోని మమల్లాపురం ఆలయ ప్రాంగణంలో కీలక సమావేశం జరగనుంది. ఈ పర్యటనలో ఇద్దరు నేతలు రెండు కార్యక్రమాల్లో నాలుగు సార్లు వేర్వేరుగా భేటీ అవుతారు. వీరిద్దరూ దాదాపు 7 గంటలపాటు కలిసి గడపనున్నారు. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు చెన్నైలో చైనా ప్రధాని జిన్‌పింగ్‌ ల్యాండ్‌ అవుతారు. మమల్లాపురంలోని మూడు ప్రఖ్యాత ప్రదేశాల్లో […]