విజయ్‌దేవరకొండ.. వెరీ హాట్! ఒక్కసారి హగ్ చేసుకోవాలనుంది

చూస్తేనే చెప్పేస్తారు.. హే! ఈ అమ్మాయి.. ఆ యాడ్ లో కనిపించింది కదా అని! అంతలా జనాన్ని అట్రాక్ట్ చేసింది సాషా. యూత్ అయితే ఆమెలా హెయిర్ స్టైల్ పెంచుకోవాలని, ఆమె మేనరిజన్స్ ని ఫాలో అవ్వాలని తెగ ట్రై చేసింది. అంతలా పాపులర్ అయ్యింది సాషా. ఒకే కంపెనీ యాడ్ లో పదే పదే కనిపించడంతో తెలుగునాట కూడా బాగా రిజిస్టర్ అయ్యింది. అందుకే ఎంతోమంది కుర్రకారు.. తమ హార్ట్ లో చోటిచ్చేశారు. కాని సాషా హృదయంలో ఎవరున్నారో తెలుసా?.. తెలుగునేలపై స్పీడ్ స్టార్ గా మారిన విజయదేవరకొండ!

విజయ్ దేవరకొండ పేరు చెబితేనే అమ్మాయిలు హా! అంటూ హ్యాపీ మూడ్ లోకి వచ్చేస్తారు. అందుకే అలాంటి హీరోతో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో యాక్ట్ చేసింది సాషా. చూడ్డానికి పక్కింటి కుర్రాడిలా విజయ్ దేవరకొండ ఉంటాడు కాని.. చూస్తే మాత్రం హగ్ చేసుకోవాలనిపిస్తుందని చెప్పింది సాషా. అంతలా ఈ బ్యూటీకి నచ్చేశాడు విజయ్.

సాషాకు సిల్వర్ స్క్రీన్ కొత్త కావచ్చు కాని, బుల్లితెరపై బాగా అనుభవముంది. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఫాలోయింగే ఉంది. అమ్మడి లుక్కు కోసం ఎంతోమంది కుర్రకారు వెయిట్ చేస్తున్నా సరే.. ఈమె మాత్రం విజయ్ వైపే చూస్తోంది. అయినా విజయ్ అంటే ఇష్టపడుతున్న భామల్లో మహేష్ బాబూ హీరోయిన్ కైరా అద్వానీ, శ్రీదేవి కూతురు జాన్వీ కూడా ఉన్నారు. ఇప్పుడీ లిస్టులో సాషా కూడా చేరింది. మొత్తానికి డేటా ప్లానని, అన్ లిమిటెడ్ కాల్స్ అని డైలాగులు చెప్పిన సాషా.. ఇప్పుడు వెండితెరపై ఎలా వగలు పోతుందో.. ఎలాంటి వలపు పాటలు పాడుతుందో చూడాలి!

TV5 News

Next Post

తెలంగాణ బంద్‌కు జనసేన మద్దతు : పవన్‌ కళ్యాణ్‌

Mon Oct 14 , 2019
TSRTC కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిశీలించాలన్నారు. ఒకేసారి వేల మంది ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్‌కు జనసేన మద్దతిస్తోందన్నారు పవన్‌ కళ్యాణ్‌.