ఆమ్రపాలికి ఢిల్లీ నుంచి కాల్.. కిషన్ రెడ్డి కార్యాలయంలో..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్ ఆమ్రపాలిని కేంద్రం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనరుగా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమ్రపాలితో పాటు మరో ఐఏఎస్ అధికారి కె. శశికిరణాచారిని కేంద్ర సర్వీసులకు బదిలీ చేశారు. కిషన్ రెడ్డికి ఓఎస్డీగా ఆమ్రపాలి, వ్యక్తిగత కార్యదర్శిగా శశికిరణాచారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

అక్కడ గెలిచేది ఎవరు?.. ఢీ అంటే ఢీ అంటున్న ప్రధాన పార్టీలు

Fri Jul 12 , 2019
తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాదికాలమైనా పూర్తవ్వకముందే.. మరో ఉప.ఎన్నిక సమరం తెరపైకి వచ్చింది. TPCC అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న సీట్ కావడంతో.. అన్ని పార్టీల ఫోకస్ అంతా ఆ స్థానంపైనే పడింది. ఈ నేపథ్యంలో.. వరుసగా ఐదు పర్యాయాలు గెలిచిన కాంగ్రెస్ పట్టుకోసం పోరాటం చేస్తుండగా.. ఎలాగైనా గెలవాలంటూ అధికార TRS పార్టీ ఆరాటపడ్తోంది. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై Tv5 స్పెషల్ పొలిటికల్ స్టోరీ. హుజూర్‌నగర్‌ […]