లిచీ పండ్లు తింటే.. పిల్లల ప్రాణాలు..?

లిచీ పండ్లు తింటే.. పిల్లల ప్రాణాలు..?

లిచీ పండ్లు.. ఇప్పుడు రోడ్లపై ఎక్కడచూసినా అవే కనిపిస్తున్నాయి. స్ట్రాబెరీ రూపంలో భలే అందంగా కనిపించే లిచీ పండ్ల వెనుక ఓ విషాద సంఘటన దాగి ఉందా అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీహార్‌లో చనిపోయిన పిల్లల మృతికి ఈ పండ్లే కారణమనే వాదన వినిపిస్తోంది. లిచీ పండ్లు తిని 53 మంది చిన్నారులు చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. మెదడువాపును పోలిన వ్యాధి కారణంగా బీహార్‌లోని ముజఫర్‌ నగర్‌ ప్రాంతంలో 50 మంది పిల్లలు మరణించారు. మరో 40 మంది పిల్లలు ఇదే రకమైన లక్షణాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

తాజా అధ్యయనం ప్రకారం లిచీ పండ్లను పరగడుపున (ఖాళీ కడుపున) అస్సలు తినకూడదని తేలింది. వాటిలో ఉండే హైపోగ్లైసిన్‌ సైక్రోప్రొపైల్‌ అసిటిక్‌ ఆసిడ్‌ రాత్రి పూట రక్తంలోని చక్కెర మోతాదులను గణనీయంగా తగ్గించి వేస్తుందని లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ జరిపిన ఒక అధ్యయనం చెబుతోంది. ముజాఫర్‌పూర్‌లో లిచీ పండ్ల తోటలు అధికంగా ఉంటాయి. చాలామంది రైతు ఈ పంటలను ఎక్కువగా పండిస్తుంటారు. వేసవి సెలవుల్లో చిన్నారులు కాలక్షేపం కోసం ఈ తోటల్లో ఎక్కువగా తిరుగుతుంటారు.ఈ సమయంలో వాటిని తింటుంటారు. దీంతో లిచీ పండ్లలో ఉండే మిథిలెన్ సైక్లోప్రోపిల్-గ్లైసిన్ (MCPG) రసాయనం పిల్లల మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నా లేదా పౌష్టికాహార లోపం ఉన్నా చిన్నారుల శరీరంలో షుగర్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఈ లోపం ఉన్న పిల్లలపై లిచీ పండ్లలోని MCPG ప్రభావం చూపుతుంది. తాజాగా చనిపోయిన పిల్లలో కూడా ఈ విదమైన సమస్యనే వైద్యులు గుర్తించారు. వారి మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏడుగురు సభ్యుల బృందం విచారణ జరిపింది. వారు కూడా ఈ విషయాన్నే దృవీకరించారు. దీంతో బీహార్‌ ఆరోగ్యశాఖ పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేసింది. పదేళ్ల లోపు పిల్లలు ఉదయాన్నే ఇతర ఆహారం ఏదీ తీసుకోక ముందు లిచీ పండ్లు తినకూడదని తెలిపింది. పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకోకుండా లిచీ పండ్లు తింటే రాత్రి వీలైనంత తొందరగా ఆహారం తీసుకోవాలని హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story