ఆశల్లేని మ్యాచ్‌లో గొప్ప పోరాటం చేసిన టీమిండియా

మాంచెస్టర్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో వరుణుడు భారత్‌తో ఆడుకున్నాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 5 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన భారత్‌ను.. రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌ కాసేపు ఆదుకున్నారు. ఆ తర్వాత కార్తీక్‌ కూడా అవుట్‌ కావడంతో భారత్ పీకల్లోకు కష్టాల్లో కూరుకుపోయింది. అయినా ఆశల్లేని మ్యాచ్‌లో టీమిండియా గొప్ప పోరాటం చేసింది.

వర్షం కారణంగా మాంచెస్టర్‌ పిచ్‌ ఆది నుంచే బౌలర్లకు సహకరించింది. ముఖ్యంగా సీమ్‌ బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, హెన్రీ, ఫెర్గూసన్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురిచేశారు. షార్ప్‌ స్వింగ్‌ ను ఆడడంలో ఉన్న బలహీనతను మరోసారి మన బ్యాట్స్‌మెన్‌ బయటపెట్టుకున్నారు. మిగతా పిచ్‌లపై ఆడినట్లు షాట్లు ఆడేందుకు ప్రయత్నించడంతో… వికెట్లు టపటపా పడిపోయాయి. ధోనీ, జడేజా భారత్‌ను దాదాపు గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ కీలక సమయంలో ఔట్‌ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. దీంతో 18 పరుగుల తేడాతో గెలిచిన న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పెరిగిన వర్షాల జోరు.. స్తంభించిపోయిన జనజీవనం

Wed Jul 10 , 2019
ఉత్తర, ఈశాన్య భారతాల్లో వర్షాల జోరు పెరిగింది. ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడున్నాయి. అసోంలో 3 రోజులుగా భారీ వానలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రధాన నదులు పొంగి ప్రవహించాయి. వరద నీటితో నదులు ఉప్పొంగడంతో దాదాపు పది జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. దీమాజీ, లఖింపూర్, బార్పేట, చిరాంగ్, గోలాఘాట్, జోర్హాట్, దిబ్రూఘడ్ జిల్లాల్లో 145 గ్రామాలు నీట మునిగాయి. అసోంలో బ్రహ్మపుత్ర నది ప్రమాదకరస్థాయిని దాటి […]