మాంచెస్టర్ మ్యాచ్‌లో ఆధిపత్యం కనబరుస్తోన్న టీమిండియా

మాంచెస్టర్ మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. బ్యాటింగ్‌లో భారీస్కోర్ చేసిన కోహ్లీసేన… బౌలింగ్‌లోనూ రాణిస్తోంది. ఛేజింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తోంది. 337 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పాక్ 13 పరుగులకే వికెట్ కోల్పోయింది. విజయ్‌శంకర్ తాను వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. అయితే భువనేశ్వర్‌కు కండరాలు పట్టేయడంతో విజయ్ శంకర్ ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు. తర్వాత కూడా పాక్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నారు. మన బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తుండడంతో పాక్‌కు ఓటమి ఖాయంగా కనిపిస్తోంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కృష్ణానది తీరంలో ఆధ్యాత్మిక శోభ

Sun Jun 16 , 2019
శార‌దా పీఠం ఉత్తరాధికారి స‌న్యాస స్వీకార మ‌హోత్సవం వైభవంగా సాగుతోంది. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో కాషాయ ధార‌ణ‌కు బాల స్వామి సిద్ధమ‌వుతున్నారు. కృష్ణా న‌దీ తీరంలో ఉండ‌వ‌ల్లి క‌ర‌క‌ట్టపై గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్రమంలో ఉత్తరాధికారి స‌న్యాస స్వీకార మ‌హోత్సవంతో ఆధ్యాత్మిక అల‌లు వీచాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచే కృష్ణా న‌దీ తీరంలో ఆధ్యాత్మిక‌త శోభ వెల్లివిరిసింది. మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు తరువాత […]