తొలిటెస్టులో విజృంభించిన భారత ఓపెనర్లు

సౌతాఫ్రికాతో విశాఖలో జరుగుతున్న తొలిటెస్టులో భారత ఓపెనర్లు విజృంభించారు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మొదట్లో ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో కుదురుకున్నాక వేగం పెంచారు. వీలుచిక్కినప్పుడల్లా బంతుల్ని బౌండరీలు దాటించారు.. లంచ్‌ తర్వాత ఈ జోడీ మరింత దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ, మాయంక్ అగర్వాల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. అయితే 59 ఓవర్లు పూర్తైన తర్వాత స్టేడియంలో దట్టంగా మేఘాలు అలుముకున్నాయి..దీంతో టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత భారీ వర్షం పడింది. దీంతో తొలిరోజు ఆట పూర్తైనట్లు ప్రకటించారు అంపైర్లు. తొలిరోజు మ్యాచ్ నిలిచిపోయే సరికి టీమిండియా వికెట్లేమీ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 115 రన్స్‌, మయాంక్ అగర్వాల్ 11 ఫోర్లు, 2 సిక్లర్లతో 84 పరుగులు చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఆ ముద్రను చెరిపివేసిన రోహిత్

Thu Oct 3 , 2019
హంటింగ్‌ గ్రౌండ్‌లో రోహిత్‌ అదరగొట్టాడు. సఫారీలను ఉతికి ఆరేశాడు. తనకు అచ్చొచ్చిన విశాఖలో మరోసారి విజృంభించాడు. తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. వర్షం కారణంగా ఆట త్వరగా ముగించాల్సి వచ్చింది. ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా టీమిండియా 202 పరుగులు చేసింది. ఓపెనర్‌గా రాణిస్తాడా అని అనుమానించిన వాళ్లకు రోహిత్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొడుతూ విశ్వరూపం ప్రదర్శించాడు. […]