అద్భుతంగా పోరాడిన సౌతాఫ్రికా.. ప్రభావం చూపని పేసర్లు

విశాఖ టెస్టులో సౌతాఫ్రికా పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 రన్స్ చేసింది.. ఇండియా కంటే ఇంకా 117 రన్స్ మాత్రమే వెనుకబడి ఉంది. 3 వికెట్ల నష్టానికి 39 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ అద్భుతంగా పోరాడారు. ఇండియన్ స్పినర్లను కాచుకొని క్రీజులో పాతుకుపోయారు…ఓపెనర్ ఎల్గర్ సెంచరీతో చెలరేగాడు.. అటు కెప్టెన్ డుప్లెసిస్‌ కూడా అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఎల్గర్-డుప్లెసిస్ జోడీ ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించింది. ఆ తర్వాత వచ్చిన వికెట్ కీపర్.. డికాక్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించాడు. ఎల్గర్‌తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించారు..ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేశాడు..

బౌలింగ్‌లో మన పేసర్లు పెద్దగా ప్రభావం చూపలేదు.. ఇశాంత్ శర్మ మాత్రమే ఒక వికెట్ తీశాడు. స్పిన్నర్లు ఎప్పటిలాగే బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి 5 వికెట్లు తీశాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశాడు.. దీంతో టెస్టులో 200 వికెట్ల క్లబ్‌లో చేరారు జడేజా.

TV5 News

Next Post

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కులంపై వివాదం

Fri Oct 4 , 2019
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి కులం ఏంటన్నది వివాదాస్పదమవుతోంది. శ్రీవాణి గిరిజన మహిళ కాదంటూ ఇటీవలే SC, ST సంఘాల నాయకులు… పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించిన కలెక్టర్‌.. KR పురం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి అధ్యక్షతన కమిటీ నియమించారు. అయితే ఈ వివాదంపై స్పందించిన మంత్రి పుష్ప శ్రీవాణి ఆరోపణలను తేలిగ్గా తీసుకున్నారు. 2014 లో కూడా […]