కేంద్రం కార్యాచరణతో ఏపీకి తొలి షాక్‌ !

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేంద్రం యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసింది. పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, అన్ని అగ్రిమెంట్లకు కట్టుబడి ఉంటామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూటిగా చెప్పారు. విద్యుత్ ఒప్పందాలకు మాదీ భరోసా అన్నారామె. కేంద్రం కార్యాచరణతో ఏపీకి తొలి షాక్‌ తగిలేలా ఉంది.

సౌర, పవన్‌ విద్యుత్‌ కంపెనీలకు LCలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు రెండ్రోజుల డెడ్‌లైన్‌ విధించింది. ఆలోగా ఇవ్వకుంటే.. కేంద్ర పూల్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయకుండా రాష్ట్రాన్ని నిషేధిస్తామని హెచ్చరించింది. దీంతో.. ఏపీ సర్కారు ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది. పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. LCలు ఇవ్వడానికి నిధుల కొరత వేధిస్తోంది. ఇవ్వకుంటే కేంద్ర పూల్‌ నుంచి కరెంట్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. PPAలపై పాలకులు చేసిన రాద్ధాంతమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు వాపోతున్నారు.

TV5 News

Next Post

ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Tue Oct 15 , 2019
ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు ప్రారంభించాలని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. ఈ క్షణం నుంచే చర్చల ప్రక్రియ మొదలు పెట్టాలంది న్యాయస్థానం. అటు ఆర్టీసీ ఎండీని వెంటనే నియమించి రెండ్రోజుల్లో చర్చలు పూర్తి చేయాలని, తిరిగి 18వ తేదీలోపు శుభవార్తతో వస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. చర్చల ద్వారా ఎలాంటి సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని అభిప్రాయం పడింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని […]