బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం

cri

అనుకున్నదే జరిగింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ను కేవలం మూడు రోజుల్లోనే ముగించేసింది కోహ్లీసేన. భారత బౌలర్లు విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 130 పరుగులకే కుప్పకూలిన.. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు లిటన్ దాస్ 35రన్స్‌, హసన్ 38 రన్స్‌ కాసేపు రహీమ్‌తో పాటు పరాజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రహీమ్ ఔట్ అయిన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్లు వెంటవెంటనే పెవిలిన్ చేరారు. భారత బౌలర్లలో షమి 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఉమేశ్ 2 వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 493 పరుగులకు 6 వికెట్ల దగ్గరే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీకి తోడు, రహానె, జడేజా అర్థ సెంచరీలతో చెలరేగారు. ఉమేష్‌ యాదవ్‌ దూకుడుగా ఆడడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ మన బౌలర్ల జోరు కొనసాగడంతో బంగ్లాదేశ్‌కు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పలేదు. ఈ గెలుపుతో టెస్టులో ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న భారత్‌.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో మరో 60 పాయింట్లు చేరాయి.

TV5 News

Next Post

ట్విటర్ వేదికగా జగన్‌పై పవన్ వ్యంగ్యాస్త్రాలు

Sat Nov 16 , 2019
ఏపీ సీఎం జగన్‌ తీరుపై సెటైర్‌ వేస్తూ ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శ చేస్తూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. జగన్‌ రెండు కాళ్లకు ఇసుక బస్తాలు కట్టి ఉన్న కార్టూన్‌ను ట్వీట్ కు ఎటాచ్ చేశారు.. ఏపీ సీఎం గురించి ఢిల్లీలో ఇలాంటి అభిప్రాయమే ఉంది అంటూ.. ట్వీట్‌ కింద కామెంట్‌ చేశారు. మొత్తం 175 […]