బ్యాంకుల విలీనంతో కస్టమర్‌ల అకౌంట్లు..

బ్యాంకుల విలీనంతో కస్టమర్‌ల అకౌంట్లు..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల విలీన ప్రక్రియ జరిగింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగి వచ్చింది. ఈ విలీనం వలన..

1. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల విలీనం జరిగి 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఏర్పడుతుంది.

2. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల విలీనం జరిగి 5వ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది.

3. ఇండియన్ బ్యాంకు అలహాబాద్ బ్యాంక్‌తో కలిసి 7వ అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది.

4. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), యునైటెడ్ బ్యాంకులు కలుస్తున్నాయి. పీఎన్‌బీనే ఈ బ్యాంకుల కార్యకలాపాలన్నీ చూసుకుంటుంది.

మరి విలీనమైతే ఆయా బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ల పరిస్థితి ఏంటి.. విలీనం తరువాత సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఇతర అకౌంట్లపై ప్రభావం పడుతుంది. కస్టమర్లు కొత్త పాస్ బుక్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు చెక్‌బుక్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఐఎఫ్‌ఎఫ్‌సీ కోడ్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జారీ అయిన క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చు. అయితే కొత్తగా వచ్చే కార్డులపై మాత్రం యూనిఫైడ్ బ్యాంక్స్ బ్రాండింగ్ ఉంటుంది. ఎఫ్‌డీ, ఆర్‌డీలపై విలీనం ఎఫెక్ట్ ఉండదు. హోమ్ లోన్స్ వెహికల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్స్ వంటి పలు రుణ ప్రొడక్టులపై ప్రభావం ఉంటుంది. విలీన ప్రక్రియ పూర్తయిన తరువాత రేట్లను ఆ మేరకు సవరిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story