మాజీ సీఎం కుమారస్వామి మెడకు మరో కేసు

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి చెక్ పెట్టే పనిలో ఉంది బీజేపీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐ ఎంక్వైరీకి అప్పగించింది. మొన్నటి వరకు జేడీఎస్ మిత్రపక్షంగా కాంగ్రెస్ కూడా యడియూరప్ప నిర్ణయాన్ని స్వాగతించాయి. దీంతో కర్ణాటక పొలిటికల్ లీగ్ లో మరో గేమ్ ప్రారంభం కాబోతోంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి థ్రిల్లర్ పాలిటిక్స్ కు వేదికగా నిలుస్తోంది కర్ణాటక. బీజేపీ, కాంగ్రెస్ నెంబర్ గేమ్ లో జాక్ పాట్ కొట్టేసి సీఎం కుర్చి తన్నుకుపోయింది జేడీఎస్. కానీ, ఆ సంబురం ఎక్కువ కాలం నిలబడలేదు. బీజేపీ గేమ్ ప్లాన్ ముందు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. యడియూరప్ప మళ్లీ సీఎం కుర్చిఎక్కారు. అయితే..ఇంకా కేబినెట్ విస్తరణ కూడా కాకముందు కర్ణాటక రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన అనుచర గణానికి చెందిన ఫోన్లను ట్యాపింగ్ చేశారని కుమారస్వామి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మొన్నటి రాజకీయ సంక్షోభ సమయంలో అనర్హత వేటుకు గురైన జేడీఎస్ నేత విశ్వనాథం..కుమారస్వామిపై ఈ ట్యాపింగ్ బాంబు పేల్చాడు. ఆపరేషన్ కమల సమయంలో నేతలు, అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. అటు సీఎల్‌పీ నేత సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు కూడా ఫోన్ ట్యాపింగ్ సంగతేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని సీఎం యడియూరప్ప సక్సెస్ ఫుల్ గా వాడుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని సీబీఐ చేతికి అప్పగించారాయన. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారి తీస్తున్న ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం ఎటు వెళ్లి ఎటూ చేరుతుందోనని కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం సీటు చేజారిన కొద్దిరోజులకే సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కొవాల్సిన పరిస్థితులు కుమారస్వామికి ఎదురవబోతున్నాయి.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *