దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచేశాయి. కుండపోత వర్షం, ఉరుములు -మెరుపులు, పిడు గులు ముంబైవాసులను భయభ్రాంతులకు గురి చేశాయి. మండే ఎండలు, భయంకర ఉక్కపోతతో అల్లా డుతున్న టైంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఏకధాటిగా వర్షం పడింది. శాంతాక్రజ్, మలాద్, కాండివలి, బోరివలి, కుర్లా, ఘట్ కోపర్, విఖ్రోలి ప్రాంతాల్లో భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడ్డాయి. దాంతో ముంబైలో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది.

రుతుపవనాల ప్రభావంతో ముంబై నగరంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు, ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్ముకోవడంతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోక లకు ఆటంకం కలిగింది. 11 విమానాలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. థాయ్ ఎయిర్ వేస్‌కు చెందిన విమానం ముంబై విమానాశ్రయంలోని రన్ వేపై దిగలేని పరిస్థితి ఏర్పడడంతో దారి మళ్లించారు. సబర్బన్ రైళ్ల రాకపోకల్లోనూ తీవ్ర జాప్యం జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story