ఆన్‌లైన్లో ఆటల కోసం.. 4వ తరగతి కుర్రాడు నాన్న జేబు నుంచి..

ఆన్‌లైన్లో ఆటల కోసం.. 4వ తరగతి కుర్రాడు నాన్న జేబు నుంచి..

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టమండీ బాబు.. ఎన్ని తెలివి తేటలు. మా రోజుల్లో అయితే ఇలా ఉండేవారా.. చెప్పిన మాట విని బుద్దిగా చదువుకునేవారు. ఇప్పుడు పిల్లలు.. పిల్లలు కాదండీ పిడుగులు.. పనికొచ్చే తెలివి తేటలయితే బానే ఉంటుంది. ఏడేళ్లకే ఎన్ని బుద్దులో.. పిల్లల తెలివికి బాధపడాలో సంతోషించాలో తెలియని పరిస్థితి తల్లిదండ్రులకి. పట్టుమని పదేళ్లయినా లేవు వాడికి. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుకోవడానికని నాన్న బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.35 వేలు డ్రా చేసేసాడు. విషయం తెలిసి నాన్న నోరెళ్లబెట్టాడు.

యూపీ రాజధాని లక్నోకు చెందిన ఓ విద్యార్థి తన తండ్రి మొబైల్ ఫోనులో పేటీఎం అకౌంట్ తెరిచి, బ్యాంకు ఖాతా నుంచి వేల రూపాయలు తీసుకున్నాడు. డబ్బులు ఎవరు తీస్తున్నారో అర్థం కాలేదు. అకౌంట్ ఖాళీ అవుతోంది. ఇందుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ రిపోర్టుతో సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు తండ్రి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం గుర్తించారు. మీ అబ్బాయే ఈ పని చేస్తున్నాడని చెప్పారు. విద్యార్థిని ప్రశ్నించి అసలు విషయం రాబట్టారు. ఆన్‌లైన్లో గేమ్ ఆడడం కోసం డబ్బులు కావాల్సి వచ్చాయని, అందుకే పేటీఎం అకౌంట్ తెరిచానని చెప్పాడు. అలా నాన్న అకౌంట్ నుంచి రూ.35 వేల వరకు డ్రా చేసినట్లు తెలుసుకున్నారు పోలీసులు. చేసేదేంలేక పిల్లాడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story