సింగిల్ ప్రీమియం.. ప్రతి నెలా ఆదాయం.. ఎల్‌ఐసీ పాలసీ పూర్తి వివరాలు..

సింగిల్ ప్రీమియం.. ప్రతి నెలా ఆదాయం.. ఎల్‌ఐసీ పాలసీ పూర్తి వివరాలు..

బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) వివిధ రకాల ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. వాటిలో పెన్షన్ ప్లాన్ కూడా ఒకటి. అదే ఎల్‌ఐసీ జీవన్ శాంతి స్కీమ్. పాలసీ తీసుకున్నవారు జీవించి ఉన్నంత కాలం వారికి పెన్షన్ వస్తుంది. అంతే కాకుండా ప్లాన్‌పై లోన్ సౌకర్యం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఇందులో 9 రకాల యాన్యుటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7 ఆప్షన్లు వెంటనే పెన్షన్ అందించేవి కావడం గమనార్హం. ఈ పాలసీని ఒకరి పేరుపై లేదా జాయింట్‌గా కూడా తీసుకోవచ్చు. కనీసం రూ.1,50,000 మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి లేదు. ఇది సింగిల్ ప్రీమియం పాలసీ. ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. తరువాత మళ్లీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేకుండా పాలసీ తీసుకోవచ్చు. 30 నుంచి 79 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఒకేసారి రూ.10 లక్షలు పెట్టి 45 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే.. ఏడాదికి రూ.74,000 నుంచి రూ.2.3 లక్షల వరకు వార్షిక యాన్యుటీ పొందవచ్చు. వచ్చే ఆదాయం మీరు ఎంచుకున్న యాన్యుటీ ఆప్షన్ ప్రాతిపదికన మారుతుంది. అయితే డబ్బు తక్షణం పొందాలా లేదంటే కొంత కాలం తర్వాత నుంచి తీసుకోవచ్చా అనేది మన ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. పాలసీ తీసుకున్న వారికి ఆదాయపు పన్ను చట్టం 80 సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంది. ఒకవేళ పాలసీ తీసుకున్న తరువాత మీకు నచ్చలేదని అనిపిస్తే 15 రోజుల్లోపు దీన్ని తిరిగి సంస్థకు ఇచ్చేయొచ్చు. అదే ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story