ఎస్‌బీ‌ఐ బంపరాఫర్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా డబ్బులు డ్రా..

ఎస్‌బీ‌ఐ బంపరాఫర్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా డబ్బులు డ్రా..

ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఎస్‌బీఐ బ్యాంకు ద్వారా జీతాలు తీసుకునే వారందరికీ ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ఉద్యోగులు సేవింగ్ ఖాతాలను ఎస్బీఐ ప్రకటించిన స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీగా (ఎస్‌జీఎస్‌పీ) మార్చుకుంటే అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇతర ఖాతాదారులతో పోలిస్తే కొన్ని మెరుగైన సేవలు, రాయితీలు, ప్రయోజనాలు పొందవచ్చని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని 42 వేల మంది ప్రభుత్వోద్యోగులకు ఎస్పీబీ నూతనంగా ప్రకటించిన ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. దీనిపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు ఎస్బీఐ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు.

అసలైతే సేవింగ్స్ ఖాతాలో రూ.500 వరకు ఉండాలన్న నిబంధన ఉంది. అయితే ఎస్‌జీఎస్‌పీ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి జరిమానా ఉండదు. నగదు డ్రా చేసుకునే వారికి పరిమితులు కూడా ఉండవు. వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.20 లక్షల వరకు బీమా ఉంటుంది. ఇందుకోసం రుణం తీసుకున్న సమయంలో ఖాతాదారే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్‌జీఎస్‌పీ ఖాతాదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.30 లక్షల బీమా వర్తిస్తుంది. వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ లభిస్తుంది. లాకర్ చార్జీలో 25 శాతం రాయితీ పొందొచ్చు.

డీడీలకు కూడా ఎలాంటి చార్జీ వసూలు చేయరు. అన్నిటికంటే ముఖ్యమైంది ఖాతాలో నిల్ బ్యాలెన్స్ ఉన్నా రెండు నెలల వేతనంతో సమానమైన మొత్తం తీసుకోవచ్చు. అయితే బ్యాంక్ ఇచ్చిన గడువు లోపు తిరిగి చెల్లించాలి. ఈ అవకాశం కూడా ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఎస్‌జీఎస్‌పీ అప్లై చేసుకునే విధానం.. ఐడీ కార్డు, పాన్ కార్డు, రీసెంట్ శాలరీ స్లిప్పు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలపై సంతకం చేసి బ్యాంకులో అందజేయాలి. జీతం ఆదారంగా ఖాతాల పేర్లు ఇలా ఉంటాయి. రూ.5 నుంచి 20 వేలు వుంటే.. సిల్వర్ ఖాతా అని, 20 నుంచి 50వేలు వుంటే.. గోల్ ఖాతా అని, 50వేల నుంచి లక్ష వుంటే.. డైమండ్ ఖాతా అని, లక్షకు పైగా శాలరీ వుంటే ..ప్లాటినం ఖాతా అని అంటారు.

Tags

Read MoreRead Less
Next Story