ఉక్కు మహిళ.. సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్న సుష్మా

ఉక్కు మహిళ.. సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్న సుష్మా

సుష్మాస్వరాజ్‌..... తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా వందకు వంద శాతం పూర్తి చేసేవారు. అందుకే బీజేపీ అగ్రనేతల్లో ఆమె ఒకరిగా నిలిచారు. సోనియాగాంధీని ఢీకొట్టిన ధీర వనితగా, ఆమె జాతీయతను ప్రశ్నించిన ఉక్కుమహిళగా సుష్మాకు పేరుంది. బీజేపీ కీలక నేతగా ఎదిగిన ఆమెకు..... అటు.. వాజ్‌పేయి ప్రభుత్వం , ఇటు ఎన్డీఏ-1 ప్రభుత్వం హయాంలో కీలక పదవులు దక్కాయి.

సుష్మాస్వరాజ్...!‌ జాతీయరాజకీయాల్లో ఎప్పటికీ చెరగని పేరు! స్వతహాగా RSS నేపథ్యంగల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ లేడీ పొలిటీషియన్‌..... తండ్రి అడుగుజాడలో క్రియాశీలక కార్యకర్తగా నడిచారు. న్యాయశాస్త్రంలో పట్టా సాధించిన ఆమె.... 25 ఏళ్ల వయస్సులోనే ఎన్నిక కావడం సంచలనం. 1977లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్థిగా అంబాలా కంటోన్మెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. ముఖ్యమంత్రి దేవీలాల్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఇక అప్పటి నుంచి రాజకీయాల్లో వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె రాజకీయ ప్రస్థానం తిరుగులేని విధంగా సాగింది. పాలిటిక్స్‌లో అడుగుపెట్టిన 20 ఏళ్లకు ఢిల్లీ సీఎం అయ్యారు.

మధ్యప్రదేశ్ లోని విదిష లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారామె. క్రమంగా ఆ స్థానాన్ని ఆమె బీజేపీకి కంచుకోటగా మార్చివేశారు. 15వ లోక్ సభలో ఆమె ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. యూపీఏ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు ఎండగట్టి.... . ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారు. సోనియా జాతీయతను ప్రశ్నించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ఓ రకంగా సోనియాగాంధీ ప్రధాని పగ్గాలను అందుకోలేకపోవడానికి కారణం సుష్మానే. ఓ విదేశీయురాలు, ఇటలీ మహిళ.... భారత ప్రధానమంత్రిగా నియమితులైతే తాను శిరోముండనం చేయించుకుంటానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో లోక్ సభలో తిరుగులేని మెజారిటీని సాధించినప్పటికీ.. సోనియా గాంధీ.... ప్రధాని పదవి రేసు నుంచి తప్పుకున్నారు . మన్మోహన్ సింగ్ కు పాలనా పగ్గాలు అప్పగించారు.

1999 లోక్ సభ ఎన్నికల్లో సోనియా కర్ణాటకలోని బళ్లారి నుంచి పోటీ చేశారు. సోనియాను ఢీ కొడుతూ తాను కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఓ దశలో సుష్మా చేతిలో.... సోనియా ఓడిపోతారనే భావించారు. అంతగా పోటీలో నిలిచారు సుష్మా. కానీ ... 56 వేల ఓట్ల తేడాతో సోనియా చేతిలో ఓడిపోయారు సుష్మా. ఆమె శక్తిసామర్ధ్యాల్ని గుర్తించి బీజేపీ హైకమాండ్‌ ఆ వెంటనే రాజ్యసభ సభ్యత్వంతో సత్కరించింది.

ఇక దక్షిణాధిలో తొలి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులోనూ సుష్మాదే కీలక పాత్ర. కర్ణాటకలో కమలం తొలిసారిగా ఆమె వల్లే వికసించింది. ఇందుకోసం...కర్ణాటకలో క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు సుష్మాస్వరాజ్‌. పార్టీ శ్రేణుల్ని గ్రామగ్రామంలోనూ ఉండేలా చర్యలు తీసుకున్నారు. చివరకు యడ్యూరప్పను కర్ణాటక బీజేపీ తొలి ముఖ్యమంత్రిని చేశారు. ఇక... ఎన్డీయే 1 హయంలోనూ తనదైన పాత్ర పోషించారు సుష్మా స్వరాజ్‌. మోడీ క్యాబినెట్ లో విదేశాంగ మంత్రిత్వశాఖ పగ్గాలను అందుకున్నారు. ఇందిరాగాంధీ తరువాత ఓ మహిళ విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులు కావడం అదే తొలిసారి. విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మా స్వరాజ్‌ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు అద్వితీయం. ప్రపంచ దేశాల్లో ఎక్కడ భారతీయులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా తాను ఉన్నాననే ధైర్యాన్ని ఇచ్చేవారు. ట్విట్టర్ లో అత్యంత యాక్టివ్ గా ఉండే మంత్రిగా పేరు సంపాదించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులను అప్రమత్తం చేసేవారు. పొరుగు దేశాల ప్రజలు మనదేశంలో వైద్యం చేయించుకోవాలనుకున్నా... సుష్మా స్వరాజ్‌ వైపే చూసేవారు. తమను ఆదుకోవాల్సిందిగా అర్ధించేవారు. పాకిస్తానీయులను సైతం... వైద్య చికిత్స కోసం అత్యవసరంగా భారత్‌కు రప్పించి... తన దయార్థ్ర హృదయాన్ని చాటుకున్నారు సుష్మా స్వరాజ్.

Tags

Read MoreRead Less
Next Story