కుటుంబసభ్యులే యువతిని అర్ధనగ్నంగా మార్చి..

కుటుంబసభ్యులే యువతిని అర్ధనగ్నంగా మార్చి..

కుటుంబసభ్యులే యువతి గౌరవాన్ని బజారుకీడ్చారు. ఆమెను ఎప్పటికి తలెత్తుకోనీయకుండా చేశారు. నచ్చిన యువకుడితో వెళ్లిపోయిందన్న అక్కసుతో ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. అర్ధనగ్నంగా మార్చి వీధుల వెంట తిప్పుతూ తీవ్రంగా కొట్టారు... ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అలిరాజ్‌పూర్‌ జిల్లా తమాచి గ్రామానికి చెందిన యువతి సమీప గ్రామాన ఉన్న వేరే తెగ యువకుడిని ప్రేమించింది. అయితే ఆమెకు కుటుంబసభ్యులు పెళ్ళిచెయ్యాలని వేరే యువకుడితో సంబంధం కుదిర్చారు.

అతనితో పెళ్లి ఇష్టం లేకపోవడంతో కుటుంబసభ్యులకు చెప్పకుండా ఇంటినుంచి పారిపోయిందా యువతి. ఆమె తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలుసుకొని వెతికి పట్టుకున్నారు కుటుంబసభ్యులు. అనంతరం ఇంటికి తీసుకువచ్చి అర్ధనగ్నంగా మార్చి బెత్తంతో కొట్టుకుంటూ వీధుల వెంట తిప్పారు. ఆ తరువాత ఊరి మధ్యలో స్తంభాలకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వాట్సాప్‌లో వైరల్‌ కావడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన గురించి తెలుసుకున్న అలీరాజ్‌ పూర్‌ ఎస్పీ దర్యాప్తునుకు ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story