స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా ఛానల్‌

స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా ఛానల్‌

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో యువతకు పెద్దపిట వేశారు. వారిలో నైపుణ్యాలను పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

యువతకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ ప్రసంగంలోని అంశాలు

ప్రధానమంత్రి డిజిటల్‌ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ అందించాం. *శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణను అనుకులంగా మలుచుకుంటాం. పీపీపీల పరంగా అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా ఉంది. * స్టాండప్‌ ఇండియా పథకం ప్రకారం వెనుకబడిన వర్గాల యువతకు ప్రాధాన్యం ఇస్తాం.* స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా ఛానల్‌. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగిస్తాం. * బసవేశ్వరుని బోధనలతో యువతకు శిక్షణ కార్యక్రమం. * ప్రపంచంలో టాప్‌-200 విద్యా సంస్థల్లో 3 భారత విద్యాసంస్థలు ఉన్నాయి. * అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకుంటాం. * స్టడీ ఇన్‌ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునే మరిన్నిఅవకాశాలు కల్పిస్తాం. * జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులు. పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు తెస్తాం.

Tags

Read MoreRead Less
Next Story