భారత్‌లో దాడులకు పాకిస్తాన్ కుట్రలు.. ఐదుగురు హతం

Read Time:14 Second

జమ్ముకశ్మీర్ విభజనతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి.. అంతర్జాతీయ సమాజం మద్దతు కరువైంది. ఎక్కడ, ఎంతగా మొత్తుకున్నా.. పాక్‌కు ఏ ఒక్కరు మద్దతివ్వలేదు. దీంతో.. ఎప్పట్లాగే తన దుష్టవైఖరిని బయటపెట్టుకుంటోంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ దేశానికి చెందిన ISI.. ఉగ్రవాద సంస్థలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు, భారత్‌లో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతున్నారు.

జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్, ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్‌.. వంటి సంస్థల అగ్రనేతలు ISIతో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. జమ్ముకశ్మీర్‌లో ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ కూడా ఎత్తివేస్తున్నారు. అటు.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం నాశనం చేస్తోంది. లీపా వ్యాలీలో ఐదుగురిని మట్టుబెట్టింది. దీంతో.. పాకిస్తాన్ రగిలిపోతోంది. తమ ఎత్తుగడలు ఫలించడం లేదని కుమిలిపోతోంది. దీంతో.. ISI అండదండలతో ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడేలా కుట్రలు చేస్తున్నారు.

ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతాడని సామెత. కశ్మీర్‌లో కల్లోలం సృష్టించి.. అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లేందుకు పాకిస్తాన్‌ స్కెచ్‌ వేస్తోంది. పాకిస్తాన్‌ సైనిక పోస్టుల దగ్గరే.. ఆర్మీ సాయంతో.. ఉగ్ర స్థావరాలు ఏర్పాటు చేశారు. అదను చూసి వాళ్లు భారత్‌లోకి చొరబడేలా ప్లాన్‌ చేశారు. వాళ్ల కుట్రలు పసిగట్టిన భారత్ సైన్యం ఆ స్థావరాలను ధ్వంసం చేసింది. ఐదుగురిని హతమార్చింది. ఆ వీడియోలు ప్రసారం చేసి.. భారత్‌లో కల్లోలం సృష్టించాలనుకున్న పాక్ కుయుక్తులను బట్టబయలు చేసింది. సరిహద్దుల్లో 18 ఉగ్ర స్థావరాలు ఉన్నట్టు భారత సైన్యం గుర్తించింది. దీంతో.. కుడితిలో పడిన ఎలుకలా.. గిలగిల్లాడుతున్న ISI.. టెర్రర్‌ గ్రూపుల ఉన్నతస్థాయి నాయకత్వంతో కీలక సమావేశం నిర్వహించింది.

మరోవైపు.. జైషే మహ్మద్ కార్యకలాపాలకు సంబంధించిన రహస్య సమాచారం కేంద్ర నిఘా వర్గాలకు అందింది. దాని వ్యవస్థాపకుడు మసూద్ అజర్ తీవ్ర అనారోగ్యంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దీంతో.. ఉగ్ర కార్యకలాపాలు పర్యవేక్షించే బాధ్యతలు.. అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్గర్‌ చూస్తున్నట్టు తెలిసింది. మసూద్ అహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించాక.. అతడి ఆరోగ్యం బాగా క్షీణించింది. రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి. బహవాల్ పూర్‌లో.. గార్డుల భద్రత మధ్య మసూద్ ఉంటుండగా, అతని సోదరుడైన అస్గర్.. ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్ సహా.. ఇతర కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాడు. పటాన్ కోట్ ఎయిర్‌బేస్‌, నగరోతా ఆర్మీ క్యాంప్, పుల్వామా దాడులకు అస్గర్‌ కుట్ర పన్నాడని నిఘా వర్గాలకు తెలిసింది. దీంతో.. వాళ్లు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also watch:

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close