విశాఖ పోలీసులపై భారత క్రికెటర్లు సీరియస్‌

విశాఖ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన క్రికెటర్లకు ఆగ్రహం తెప్పించారు పోలీసులు. అధికారుల మధ్య అవగాహన లోపంతో భారత క్రికెటర్లు వర్షంలో తడవాల్సి వచ్చింది. భారత జట్టు ఉన్న బస్సును విశాఖ ఎయిర్‌పోర్టు మూడో ఫ్లాట్‌ఫాంలో నిలిపారు. అయితే అప్పటికే భారీ వర్షం పడుతుండడంతో వారంతా అక్కడి నుంచి తడుసుకుంటూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలసి వచ్చింది. ఫస్ట్‌ ఫ్లాట్‌ ఫాంలో ఎందుకు బస్‌ పార్క్‌ చేయలేదని ఎయిర్‌ పోర్ట్‌ సీఐను రోహిత్‌ శర్మ ప్రశ్నించాడు. అక్కడ సౌతాఫ్రికా క్రికెటర్ల బస్సు ఉందని చెప్పడంతో.. భారత క్రికెటర్లు అలానే వెళ్లిపోయారు.

TV5 News

Next Post

కశ్మీర్‌లో ఆపరేషన్ గాందర్బల్.. 10 రోజులుగా హెలికాఫ్టర్..

Mon Oct 7 , 2019
కశ్మీర్ లో భద్రతా దళాలు పెద్ద ఆపరేషన్‌కు తెరతీశాయి. ఇక్కడి గాందర్బల్ అడువుల్లోకి అత్యున్నత బలగాలను హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తున్నాయి. పదిరోజులుగా ఈ వ్యవహారం సీక్రెట్‌గా నడుస్తోంది. ఇటీవల ఈ అడవుల్లో ఇద్దరు టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. అప్పటి నుంచి కూబింగ్ మరింత ముమ్మరం చేశారు. ఇక్కడి వెళ్లడానికి ఎలాంటి రోడ్లు లేవు. దీంతో సైన్యాన్ని వేగంగా అక్కడకు చేర్చేందుకు ఎయిర్ లిఫ్ట్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఇటీవల గాందర్బల్ అడవుల్లో […]