అనుకోకుండా మీ రైలు ప్రయాణం క్యాన్సిల్ అయితే మీ టికెట్‌ మరొకరి పేరు మీదకు..

Read Time:0 Second

ఊరు వెళ్ళడానికని 10 రోజులు ముందుగానే ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకున్నారు. కానీ అనుకోకుండా ఆఫీస్‌లో అర్జంట్ పని ఉండి ఊరు వెళ్లడాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. మరి టికెట్ క్యాన్సిల్ చేయకుండా మరొకరి పేరు మీదకు మార్చాలనుకుంటే అందుకు అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయితే ఈజీగా మరొకరి పేరు మీదకు మార్చేయొచ్చు. మరి ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
1. ఇందుకోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. రైలు బయలు దేరడానికి 24 గంటల ముందే రైల్వే ఆఫీసుకు వెళ్లాలి.
2. ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ ప్రింట్ అవుట్ తప్పనిసరిగా ఉండాలి. దాంతో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కూడా ఉండాలి.
3.టికెట్ పేరుతో పాటు బోర్డింగ్ స్టేషన్ కూడా మార్చొచ్చు. పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న టికెట్లకు ఏ నిబంధనలు ఉంటాయో ఇ-టికెట్‌కూ అవే నిబంధనలు వర్తిస్తాయి.
4. ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో.. ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేరు మీద క్యాన్సిల్ టికెట్‌ను బదిలీ చేస్తారు. బయటి వ్యక్తులకు బదిలీ జరగదు. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, కొడుకు, కూతురు, భర్త, భార్య మాత్రమే అర్హులు.
5.టికెట్ బదిలీ చేయాలనుకుంటున్న ప్యాసింజర్‌కు మీకు ఉన్న సంబంధాన్ని ధృవీకరించే ఫ్రూవ్ ఏదైనా ఉండాలి. రైల్వే నిబంధనలకు లోబడే ఈ మార్పులన్నీ జరుగుతాయి.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close