ఇండోర్ టెస్టులో ఇరగదీసిన టీమిండియా

cricket

ఇండోర్ టెస్టులో టీమిండియా ఇరగదీసింది. తొలిరోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది. విజృంభించిన పేసర్లు..తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్‌ చేశారు.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 64 పరుగుల వెనుకంజలో ఉంది. పుజారా 43, మయాంక్ అగర్వాల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ ఈసారి విఫలం అయ్యాడు… 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాకు టీమిండియా పేసర్లు చుక్కలు చూపించారు. నిప్పులు చెరిగే బంతులతో వరుసగా వికెట్లు తీశారు..మహ్మద్ షమి రివర్స్‌స్వింగ్‌కి బంగ్లా బ్యాట్స్‌మెన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. షమి మూడు వికెట్లు తీయగా..ఇషాంత్ శర్మ , ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా రెండు వికెట్లు తీశారు.

TV5 News

Next Post

ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం - అశ్వత్థామ రెడ్డి

Thu Nov 14 , 2019
ఆర్టీసీ విలీన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని… మిగతా అంశాలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని… జేఏసీ నాయకుడు అశ్వత్థామ రెడ్డి డిమాండ్‌ చేశారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా… అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులను తప్పుదోవ పట్టించేలా కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 15 నుంచి… 19 వ తేదీ వరకు కార్యాచరణను […]