ప్రేమ విఫలమైందని ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య

crime

నల్గొండ జిల్లాలో ప్రేమ విఫలమై ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. చండూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాష్‌రావు అనే విద్యార్థి.. హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఓ మైనర్ బాలికను ప్రకాష్‌ ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో వారు ప్రకాష్‌ను బెదిరించారు. పేరెంట్స్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్‌ మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకు ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

TV5 News

Next Post

ఆరునెలల్లో రాష్ట్రాన్ని ముంచిన సీఎంగా పేరు తెచ్చుకున్నారు: చంద్రబాబు

Sat Nov 16 , 2019
ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న జగన్‌.. ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచుతున్న సీఎంగా జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్నారన్నారు. ఇందుకు పత్రిక కథనాలే నిదర్శనమన్నారు. తనమీద కక్షతో తాను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలంటూ ట్వీట్‌ చేశారు చంద్రబాబు. జగన్‌పై ఇంగ్లీష్‌ పత్రికలో వచ్చిన ఆర్టికల్‌ను ట్యాగ్‌ […]