ప్రేమలో పడ్డ అఖిల్ భామ.. అతడితోనే..

ప్రముఖ తమిళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్, అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో చిత్రంలో నటించింది. సాయిధరమ్ తేజతో చిత్రలహరి సినిమాలో మరోసారి కనిపించింది. ఇదిలా ఉండగా కళ్యాణి మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారట. ఈ విషయంపై కళ్యాణి స్పందిస్తూ.. ప్రేమ, డేటింగ్ మాట నిజమే కానీ.. అతను ఎవరనేది మాత్రం చెప్పను. అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి.. పెద్దల నుంచి మాకు ఇబ్బందులు తలెత్తవని అనుకుంటున్నాను అని అంది. మీరనుకున్నట్లు అతడు ప్రణవ్ కాదు. అతడు నాకు సోదరుడిలాంటి వాడు. అతనితో డేటింగ్ అన్న వార్తలు విని నవ్వుకున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే అతని గురించి చెప్తాను అని వివరించింది కళ్యాణి. ప్రస్తుతం కళ్యాణి తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడీగా చేస్తోంది. తండ్రి ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

TV5 News

Next Post

డ్రైవర్‌పై చెప్పులతో దాడి చేసిన లేడీ కండక్టర్

Sat Oct 5 , 2019
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆర్టీసీ కార్మికుల ధర్నాలు, రాస్తారోకోలతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పింది. సమ్మెను లెక్క చేయకుండా ప్రభుత్వం ప్రైవేట్‌ డ్రైవర్లను పెట్టి నడిపిస్తుండడంపై ఆర్టీసీ కార్మికులు భగ్గుమంటున్నారు. పలు జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు బస్సులపై దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు […]