జబర్దస్త్ షో నుంచి ఒకేసారి ముగ్గురు..

బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచే కామెడీ షో జబర్థస్త్ అత్యంత ప్రజాదరణ పొందిన షోగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ షో ద్వారా చాలా మంది యువ కళాకారులకు ఉపాధి దొరకడంతో పాటు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. వెండి తెరపై హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నవారూ ఉన్నారు. ఇప్పటికే షకలక శంకర్ హీరోగా నటిస్తుండగా,
ధన్‌రాజ్, చలాకీ చంటీ, రాకెట్ రాఘవ, హైపర్ ఆదిలు సినిమాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ షో నుంచి హీరోలుగా వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో సుడిగాలి సుధీర్ ముందు వరుసలో ఉన్నాడు. సాప్ట్‌వేర్ సుధీర్‌గా అభిమానులను అలరించనున్నాడు. మరో కమెడియన్ చమ్మక్ చంద్ర రామ సక్కనోళ్లు సినిమా ద్వారా హీరో అయ్యాడు. రంగస్థలం ఫేమ్ మహేష్ ఆచంట నేను నాగార్జున అని మనముందుకు రాబోతున్నాడు. మరి ప్రేక్షకులు వీరిని హీరోలుగా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కుమారుడికి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్‌ ఇచ్చి వస్తుండగా..

Thu Sep 19 , 2019
విదేశాలకు వెళుతున్న కుమారుడికి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్‌ ఇచ్చి తిరుగుప్రయాణమైన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. జనగామ జిల్లా దేవర్పుల వద్ద పెనుగొండ గణేష్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు, మినీ లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతులంతా మహబూబాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదస్థలంలోనే ముగ్గురు చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ […]