ప్రమాణస్వీకారం తొలిరోజే సీఎం జగన్‌ ముద్ర

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరేజే జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రమాణస్వీకారోత్సవం జరిగిన కొన్ని గంటల్లోనే నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదీలి చేసిన ప్రభుత్వం గురువారం రాత్రి మరికొందరిని మార్చింది. ప్రస్తుతం విజిలెన్స్‌ డీజీగా ఉన్న గౌతం సవాంగ్‌ను ఏపీ డీజీపీ నియమించింది. ఈ మేరకు ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. ఇప్పటి వరకు డిజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్‌ను బదిలీ చేసి.. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా నియమించారు. ఇప్పటివరకు ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరిలో కమిషనర్‌గా ఉన్న త్రిపాఠిని జేఏడీకి బదిలి చేశారు.

ఎన్నికల సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీబీ డీజీ ఏబీ వెంకటేశ్వర్‌రావుకు కూడా స్థానచలనం కలగింది. ఆయన్ను జీఏడికి రిపోర్ట్‌ చేయాలంటూ.. ఉత్తర్వులో పేర్కొన్న సర్కారు.. ఆయనకు ఎలాంటి పోస్ట్‌ ఇవ్వకపోవడం విశేషం. ఎన్నికల సమయంలో ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. ఏబీ వెంకటేశ్వర్‌రావు స్థానంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. అలాగే మరో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎస్‌ఎస్‌ రావత్‌ నియమితులయ్యారు. మరోవైపు ఆయకు సాంఘీక ,సంక్షేమశాఖ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ను నియమించింది. త్వరలో ఐపీఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. కీలక శాఖల్లోని ఐపీఎస్‌లను ఎంపిక చేసే బాధ్యతను కొత్త డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. మొత్తంగా.. పలువురు ఉన్నతాధికారులన్ని బదిలి చేసి సీఎంగా తొలిరొజే జగన్‌ తనదైన ముద్ర వేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మిత్రపక్షాలకు ఝలక్.. మోదీ, అమిత్ షాల భారీ స్కెచ్?

Fri May 31 , 2019
ప్రధాని మోదీ సహా 58 మందితో కేంద్ర కేబినెట్‌ కొలువుదీరింది. అయితే పార్టీలో కొందరు సీనియర్లు సహా మిత్రపక్షాలకు తీవ్ర నిరాశే ఎదురైంది. బీహార్‌లో నితీష్ నేతృత్వంలోని జేడీయూ 11 సీట్లు గెలుచుకుంది. అయితే ఆ పార్టీకి ఒక కేబినెట్‌ మంత్రి పదవి ఇస్తామన్నారు. కానీ నితీష్ రెండు బెర్త్‌లు కోరారు. ఆశించింది దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన జేడీయూ కేబినెట్‌లో చేరలేదు. అయితే జేడీయూకు ఒక్క బెర్త్‌ మాత్రమే […]