జగన్ ఇంటి సమీపంలో 40 మందిని మత మార్పిడి చేశారు : పవన్ కళ్యాణ్

cm-jagan

బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనన్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో విభేదించిన కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశామని గుర్తు చేశారు. అమిత్‌షా అంటే వైసీపీ వాళ్లకే భయమని.. తనకు గౌరవం ఉందని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన పవన్.. YCPపై మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు వైసీపీ వాళ్లే నాతో సంప్రదింపులు జరిపారని అన్నారు.

మత మార్పిడుల అంశంపైనా పవన్ తీవ్రంగా స్పందించారు.. జగన్ ఇంటి సమీపంలో 40 మందిని మత మార్పిడి చేస్తే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న మతమార్పిడిలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. తిరుమల వెళ్లి జీసస్ అనకూడదని అన్నారు. ధర్మ పరిరక్షణ కోసం తాను ఎంత వరకైనా వెళ్తానన్నారు.

TV5 News

Next Post

తెలుగు తేజం.. మైక్రోసాప్ట్‌లో ఉద్యోగం.. కోటిన్నర జీతం..

Wed Dec 4 , 2019
నల్గొండ జిల్లా ధర్మాపురానికి చెందిన చింతరెడ్డి సాయిచరిత్ రెడ్డి బాంబే ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్లో అతడు మైక్రోసాప్ట్ కంపెనీకి మంచి ప్యాకేజీతో ఎంపిక అయ్యాడు. అతడికి ఏడాదికి కోటిన్నర జీతం ఇచ్చేందుకు కంపెనీ ముందుకొచ్చింది. తనతో పాటు మరో ముగ్గురు ఎంపిక కాగా చరిత్ తెలుగు వాడు కావడం మనకు గర్వకారణం.