తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారు : పవన్ కల్యాణ్ హెచ్చరిక

ka

తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగుభాష, సంస్కృతిపట్ల మన రాజకీయ నేతలకు ప్రేమ లేదన్నారు. భాష విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇంగ్లీష్ అవసరమే కానీ తెలుగునూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు పవన్. ఊరికి ఒక్క విద్యార్థి తెలుగు మాద్యమంలో చదవాలనుకున్నా…తెలుగు మీడియాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

విజయవాడ ఏలూరు రోడ్డులోని విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు పవన్. అక్కడున్న వివిధ రకాల బుక్స్‌ను పరిశీలించారు. కార్ల్ మార్క్స్ పెట్టుబడి, ఫౌంటెన్ హెడ్ వంటి పలు పుస్తకాలు కొనుగోలు చేశారు.

TV5 News

Next Post

హృతిక్ రోషన్‌పై అభిమానం.. భర్తను కూడా అలానే ఉండమనేసరికి..

Wed Nov 13 , 2019
అమ్మాయిలకు హీరోలు, అబ్బాయిలకు హీరోయిన్లు నచ్చడం మామూలే. ఏదైనా పరిధులు దాటనంతవరకు బాగానే ఉంటుంది. మరీ శృతి మించితేనే మొదటికే మోసం వస్తుంది. తన భర్తలో హృతిక్‌ని చూసుకోవాలని ఆశ పడింది ఓ ఇల్లాలు. అమెరికా న్యూయార్క్‌లో ఉంటున్న దినేశ్వర్, డోజోయ్‌లు భార్యాభర్తలు. దినేశ్వర్ సాప్ట్‌వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండగా, భార్య డోజోయ్‌ బార్‌లో ఉద్యోగం చేస్తోంది. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి భార్య హృతిక్ నామస్మరణ చేయడం భర్తకు ఓ […]