రాజధాని పొల్యూషన్‌కి జపనీస్ టెక్నాలజీతో చెక్.. సుప్రీం సలహా!!

delhi

దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కాసారంగా మారుతోందని రాజధాని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో వాయు కాలుష్యం సమస్యపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని తప్పు పట్టింది. కాలుష్యాన్ని పారద్రోలేందుకు జపాన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని కోరింది. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై నివేదికను డిసెంబర్ 3 లోగా సమర్పించనుంది. వాయు కాలుష్య సమస్య ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదన్నదని స్పష్టమవుతున్నదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని జపాన్ లోని ఒక విశ్వవిద్యాలయం పరిశోధన నిర్వహించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. జపాన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు విశ్వనాథ్ జోషిని బెంచ్‌కు పరిచయం చేశారు. వాయు కాలుష్యాన్ని నిర్మూలించే అవకాశం ఉన్న హైడ్రోజన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆయన వివరించారు.

TV5 News

Next Post

మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడిగితే తప్పేంటి : మంత్రి బొత్స

Wed Nov 13 , 2019
పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారయణ కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌పై సీఎం జగన్‌ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదన్నారు బొత్స.. పవన్‌ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని అడగితే తప్పేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ పని చేసినా.. విమర్శించడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు.. చంద్రబాబు, లోకేష్‌ల తీరుపైనా బొత్స నిప్పులు చెరిగారు. ట్విట్టర్‌ వేదికగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగపూర్‌ కంపెనీలు పూర్తిగా […]