నరేష్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి – జీవిత, రాజశేఖర్‌

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. మా ప్రెసిడెంట్‌ నరేష్‌పై ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవితలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రెసిడెంట్‌ అయినప్పటి నుంచి నరేష్‌..  చేసిందేమి లేదంటూ ఆరోపించారు జీవితా రాజశేఖర్‌లు‌. నరేష్‌ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన పదవిలో వచ్చినప్పటి నుంచి ఫండ్‌ రైజింగ్‌ కూడా చేసిందేమి లేదంటూ ఫైరయ్యారు. అంతే కాకుండా.. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో వీరి మధ్యం వివాదం మరింత ముదురుతోంది.

TV5 News

Next Post

పేలిన గ్యాస్‌ సిలెండర్‌.. 35 ఇళ్లు దగ్ధం

Sun Oct 20 , 2019
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలో మల్లికాసుల పేటలో మంటలు చెలరిగే 35 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇళ్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలుతున్నాయి. ఘటానాస్థిలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులో తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు స్థానికులు. షార్ట్‌ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.