జార్ఖండ్‌లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌

Read Time:0 Second

elections

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్, స్పీకర్‌ నిదేష్‌ ఓరాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా.. తదితర ప్రముఖులు ఈ దఫా బరిలో ఉన్నారు. 20 సెగ్మెంట్లలో మొత్తం 260 మంది బరిలో ఉన్నారు. 47 లక్షల మంది వారి భవిష్యత్తుని డిసైడ్‌ చేయనున్నారు. 42 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 18 నియోజకవర్గాల్లో సాయంత్రం 3 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. మిగతా రెండు చోట్ల సాయంత్రం 5 వరకు ఓటు వేసే వీలుంది.

జార్ఖండ్ అసెంబ్లీకి తొలి విడతలో నవంబర్ 30న 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈనెల 20న చివరి విడత పోలింగ్ నిర్వహిస్తారు. ఈనెల 23న ఓట్లు లెక్కించి.. ఫలితాలు ప్రకటిస్తారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close