వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ

కడప జిల్లా రాజంపేటలో మండలం పోలి గ్రామంలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చెరువు మట్టి విషయంలో పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దీంతో ముగ్గురి తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించగా అక్కడ కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరినొకరు దూషించుకుంటూ డాక్టర్‌ ముందే కుర్చీలతో ఘర్షణకు దిగారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉన్న ఇరువర్గాలకు చెందిన వారిని పోలీసులు చెదరగొట్టారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TV5 News

Next Post

టీఎస్ఆర్టీసీ సమ్మెపై చర్చల దిశగా ముందడుగు

Wed Oct 16 , 2019
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలతో చర్చల దిశగా ఒక అడుగు ముందుకు పడింది. బుధవారం తెలంగాణ సీఎస్‌తో టీఎన్జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఆర్టీసీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా తాజా పరిణామాలతో కేసీఆర్‌ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిని రేపుతోంది. అటు ప్రభుత్వాన్ని, ఇటు కార్మికులపై ప్రశ్నల వర్షం కురిపించిన ఉన్నత న్యాయస్థానం.. సమ్మె పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని […]